uttrkhandh ucc : ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది?
uttrkhandh ucc : ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది?
కరెంట్ అఫైర్స్: జనవరి 27, 2025
- 76వ గణతంత్ర వేడుకలు:
-కర్తవ్యపథ్ వేదికగా వేడుకలు ఘనంగా జరిగాయి.
-ఈసారి ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో హాజరయ్యారు.
-కవాతులో నారీశక్తి సత్తా చాటింది. చరిత్రలో తొలిసారిగా 100 మహిళలు శంఖం, నాదస్వరం, డోలు వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ పరేడ్ లో పాల్గొన్నారు.
-ఈ సారి వేడుకల్లో ప్రధాని మోదీ ఎరుపు, పసుపు కలిగలిసిన వర్ణంతో రాజస్థాన్ సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. - ‘ధరోహర్’(dharohar) పథకాన్ని ఏ సంస్థ ఆవిష్కరించింది? దాని ఉద్దేశం ఏంటి?
- దేశీయ సెక్యూరిటీ మార్కెట్లో కీలక మైలురాళ్లను తెలియజేసేందుకు డిజిటల్ నాలేడ్జ్ రిపాజిటరీ ‘ధరోహర్’ను సెబీ జనవరి 26న ఆవిష్కరించింది. భారత సెక్యూరిటీల మార్కెట్ ఘన చరిత్ర, కాలక్రమంలో చేసిన మార్పులను తెలియజేసేలా ధరోహర్ ను రూపొందించారు.
3. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుష విజేత ఎవరు?
-జనవరి 26న జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో సీడ్ జ్వెరెవ్(జర్మనీ)పై నెగ్గి టాప్ సీడ్ ఆటగాడు యానిక్ సినర్(ఇటలీ)(yanik sinner) విజేతగా నిలిచాడు. జిమ్ కారియర్ తర్వాత వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ విజేతగా సినర్ నిలిచాడు. 2024లో కూడా అతడే విజేత.
4. ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి(ucc) ప్రారంభం:
-జనవరి 27 నుంచి ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి ప్రారంభం కానున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు.
-దేశంలో యూసీసీని అమలు పరిచిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలువనుంది.
యూసీసీ ముఖ్య అంశాలు(ucc complete analysis):
-వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగసమానత్వం సాధించేలా ఉంటుంది.
-సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. సహజీవనం చేస్తున్నవారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే.
-సైనికులు, వాయుసేనలో పనిచేస్తున్నవారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు, నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.
-అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహా వయస్సు ఒకేలా ఉంటుంది.
-అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు.
-హలాల్ విధానంపై నిషేధం విధించారు.
బిల్లు వివరాలు:
యూసీసీ ముసాయిదా రూపకల్పనకు సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని 2022 మే 27న ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియమించింది.
-అది ఏడాదిన్నర పాటు కసరత్తు చేసి ముసాయిదా బిల్లును రూపొందించింది.
-2024 ఫిబ్రవరి 2 ముసాయిదా బిల్లును ప్రభుత్వానికి అందించింది.
-2024 ఫిబ్రవరి 7న అసెంబ్లీ ఆమోదం, నెల రోజుల తర్వాత రాష్ట్రపతి ఆమోదం.
-బిల్లు అమలుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు మాజీ సీఎస్ శత్రుఘ్ను సింగ్ సారథ్యంలో నిపుణుల కమిటీని నియమించింది. 2024 చివర్లో ఈ కమిటీ నివేదిక అందించింది.
- ‘ఆపరేషన్ కగార్’ అనగా?
-దేశంలోని మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బలగాలు ఈ ‘ఆపరేషన్ కగార్’(operation kagar) ను చేపట్టాయి. - తెలంగాణ ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలు:
- జనవరి 26న తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించింది. మొదటగా రాష్ట్రంలోని 606 గ్రామాల్లో ఈ పథకాలకు శ్రీకారం చుట్టింది.
-నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- అంతర్జాతీయ సహకార కూటమి(icc) గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ ను ఎక్కడ నిర్వహించింది?
-న్యూఢిల్లీలో. 2024 నవంబర్ 25 నుంచి 30 వరకు ఈ సదస్సు జరిగింది. భారత్ తొలిసారిగా ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. ‘కో ఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్’ అనే థీమ్ తో ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులోనే ప్రధాని మోదీ ‘యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కో ఆపరేటివ్స్ 2025’ను ప్రారంభించారు. అంతర్జాతీయ సహకార కూటమిని 1895లో స్థాపించారు. దీని కేంద్ర కార్యాలయం స్విట్లర్లాండ్ లోని జెనివాలో ఉంది.
- డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డ్ ఫర్ మైనారిటీ అప్ లిఫ్ట్ మెంట్ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు?
- ప్రధాని నరేంద్ర మోదీకి. ఈ పురస్కారాన్ని వాషింగ్టన్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మైనారిటీస్ సంయుక్తంగా ప్రకటించాయి.
- ఇటీవల ఏ పశ్చిమ ఆఫ్రికా దేశం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నూతన రాజ్యాంగాన్ని ఆమోదించింది?
గాబన్ దేశం. 55 సంవత్సరాల రాజవంశ పాలనకు చరమగీతం పాడి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో. ప్రధాన మంత్రి పదవిని రద్దు చేశారు. అధ్యక్ష పదవి ఏడేళ్ల చొప్పున రెండు కాలపరిమితులకు మాత్రమే ఉంటుంది.
- దేశంలోని విద్యార్థులకు గుర్తింపు కార్డుగా దేన్ని తీసుకు వచ్చారు?
ఆపార్(APAAR). ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఈ ఐడీలో 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. విద్యార్థుల విద్యా, ఇతర అంశాలకు సంబంధించిన రికార్డులను ఒకే చోట డిజిటల్ ప్లాట్ ఫాంపై భద్రపరచడం దీని ఉద్దేశం. - నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది? దాని విశేషాలు ఏంటి?
-ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో. జనవరి 28న మహాపూజతో ప్రారంభం కాబోతుంది.
-ఈ జాతర పూజల్లో జోన్న గట్కాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే ఆదివాసీల్లో మరణించిన పెద్దలకు కుటుంబ సభ్యులు తమ కుల దేవతల వద్దకు వెళ్లి తూమ్ పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల అనంతరమే వంశంలోని తమ కితకు చెందిన కోడళ్ల బేటింగ్(దేవుడి పరిచయం)తో పాటు ఇతర పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.
- ‘నాగోబా జాతర’ పుస్తకాన్ని ఎవరు రాశారు?
- హైదరాబాద్ కు చెందిన జెన్నిఫర్ అల్ఫాన్స్. ఈమె షార్ట్ ఫిల్మ్ మేకర్. నాగోబా జాతరపై 8 ఏండ్లుగా పరిశోధన చేసి డాక్యుమెంటరీ రూపొందించారు. నాగోబా జాతర అనే పుస్తకాన్ని కూడా రచించారు. గతంలో ఈమె ‘గుస్సాడీ’ అనే పుస్తకాన్ని సైతం రచించారు.
మరిన్ని విద్యాసంబంధిత వార్తలకు telugu job motivators.com వెబ్ సైట్ లో చదవండి