2025లో మన కలను సాకారం చేసుకుందాం!
2025లో మన కలను సాకారం చేసుకుందాం!
గత నాలుగైదేండ్లుగా ప్రిపరేషన్ చేసి చేసి అలసిపోయాం. దాదాపు ఐదారు లక్షల మంది ప్రిపరేషన్ లో ఉంటే కొందరు మాత్రమే ఉద్యోగాల సాధిస్తారు. జాబ్ రాని వారందరూ నిరాశలోకి వెళ్లిపోతారు. అయిన కూడా పట్టువదలని విక్రమార్కులుగా రాబోయే నోటిఫికేషన్లలో ఏదో ఒక జాబ్ కొట్టి జీవితంలో స్థిరపడాలనుకుంటారు. మరి కొత్త నోటిఫికేషన్లు వస్తాయా? టైమ్ కు భర్తీ చేస్తారా? మరో సంవత్సరంన్నర పాటు ఆర్థికంగా ఎలా మేనేజ్ చేసుకోవాలి? అనే ప్రశ్నలతో సతమతమవుతుంటారు. మరి ఇప్పుడేం చేయాలి? గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుదామా? ఏదైనా ప్రైవేజ్ జాబ్ లో జాయిన్ అయిపోదామా? అనే సందేహాలు వారి మెదళ్లను తొలుస్తుంటాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగుల పరిస్థితి ఇదే.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చాయి. జాబ్ కొట్టాలంటే సుదీర్ఘ ప్రిపరేషన్ అవసరం అనేది మనకు తెలిసిందే. ఇంకా మీనమేషాలు లెక్కపెట్టకుండా వెంటనే ప్రిపరేషన్ ప్రారంభిస్తేనే మంచిది. ఎందుకంటే అందరూ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కొంత చదివి ఉన్నారు. ఇక చివరి ప్రయత్నంగా ఈ ఏడాదిలో తమ ప్రతిభకు ప్రతిఫలం పొందాలనుకుంటారు. అందుకే బుక్కుల బూజును దులిపేయండి.. ప్రిపరేషన్ ప్రారంభించండి. మూస ధోరణిలో చదవకుండా ప్రస్తుతం వస్తున్న కఠిన ప్రశ్నపత్రాలను ఎదుర్కొనేలా సన్నద్ధం కావాల్సిందే. పక్కా ప్రణాళిక ప్రకారం చదివితేనే జాబ్ కొట్టడం సాధ్యమవుతుంది. చదవడం ఎంతో ప్రాక్టీస్ కూడా అంతే అవసరం. రోజువారీ కరెంట్ అఫైర్స్ ను ఫాలో కావడం, జనరల్ ఇంగ్లిష్, డాటా ఇంటర్ ప్రిటేషన్, అర్థమేటిక్, రీజనింగ్ వంటి సబ్జెక్ట్ లను రోజువారీ ప్రిపరేషన్ లో భాగం చేసుకోవాలి. అలాగే రోజూ ఏదైనా కోర్ సబ్జెక్ట్ ను చదవడం మంచిది.
నోటిఫికేషన్లు వస్తేనే చదువుదాం అనుకుంటే మీరు ఎన్నటికీ జాబ్ కొట్టలేరు. నోటిఫికేషన్లు రాకముందే అన్ని సబ్జెక్టులు కనీసం ఒకసారి చదివి ఉంటే మంచిది. ఆ తర్వాత కనీసం మూడు నాలుగు రివిజన్ లైనా చేయాలి. అందుకే సమయం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ చేస్తే మంచిది. ఈ ఏడాదిలోనైనా మనం కోరుకున్న జాబ్ సాధించి మన కల నెరవేర్చుకోవాలి. అందుకే పదండి బుక్కులను ఓ పట్టు పట్టేద్దాం.