సంచార్ సాథీ’..సైబర్ మోసాల ఆటకట్టు
‘సంచార్ సాథీ’..సైబర్ మోసాల ఆటకట్టు
కరెంట్ అఫైర్స్ 18-1-2024
(యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్, ఇతర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ఉద్యోగార్థులకు కరెంట్ అఫైర్స్ అనేది కీలక విభాగం. దీని కోసం న్యూస్ రీడింగ్ పేపర్ అత్యంత అవసరం. అయితే సమయాభావం వల్ల విద్యార్థులు పేపర్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపరు. అలాంటి వారి కోసం ప్రతీ రోజూ అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చే కరెంట్ అఫైర్స్ అంశాలను డిటైల్డ్ గా అందిస్తున్నాం. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.)
- మోసపూరిత కాల్స్, ఎస్ఎంఎస్ లపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కేంద్రం తాజాగా తీసుకొచ్చిన మొబైల్ యాప్ ఏది?
జ: మోసపూరిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కేంద్ర టెలికాం విభాగం ‘సంచార్ సాథీ’ (sanchar sathi)అనే మొబైల్ యాప్ ను జనవరి 17న ఆవిష్కరించింది. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండు ప్లాట్ ఫామ్ ల పైనా పనిచేస్తుంది. దీని ద్వారా సైబర్ మోసాల(cyber frauding)ను అరికట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. - తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో కుదిరిన మొదటి ఒప్పందం ఏది?
జ: జనవరి 17న తన విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీమ్ సింగపూర్ కు చేరుకుంది. అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐటీఈ)తో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది.
3.మెగ్నీషియం కేథోడ్ లతో చవకగా ఈవీ బ్యాటరీలను ఏ భారత సంస్థ తయారుచేయబోతోంది?
జ: స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ వాహనాల్లో వాడే లిథియం ఆయాన్ బ్యాటరీల ధరను గణనీయంగా తగ్గించే ప్రత్యామ్నాయాన్ని ఒడిషాలోని రవూర్కెలా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ఈ బ్యాటరీల నిర్మాణంలో విరివిగా ఉపయోగించే కోబాల్ట్ స్థానంలో చవకగా లభ్యమయ్యే మెగ్నీషియాన్ని సమర్థంగా వాడుకోవచ్చని వారు నిరూపించారు. కోబాల్ట్ చాలా ఖరీదైనది, మన దేశంలో చాలా తక్కువగా లభ్యం అవుతుండడంతో క్యూబా, మడగాస్కర్, పాపువా న్యూగినియా దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మెగ్నీషియం వాడకంతో ఆ బాధలు తీరనున్నాయి. మన దేశంలో మెగ్నీషియం నిల్వలు తమిళనాడు, ఉత్తరాఖండ్, కర్నాటక రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. ఇది చవకైనది కూడా.
- రాష్ట్రంలో టికెటింగ్ వ్యవస్థను సులభతరం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ఏ యాప్ ను తీసుకొచ్చింది?
జ: రాష్ట్రంలోని పలు దేవాలయాల దర్శనం, పూజలు, పార్కుల సందర్శన, మెట్రో రైలు టికెట్లు, బోటింగ్, క్రీడా సౌకర్యాలు, కమ్యూనిటీ హాళ్ల బుకింగ్ ల కోసం ఇటీవలే ‘మీ టికెట్’ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. - అఖిల భారత సహకార ఉత్సవాలను ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?
జ: దేశంలో సహకార సంఘాలు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఏటా ‘నేషనల్ కో ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా’ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నవంబర్ 14 నుంచి 20 వరకు ప్రతీ ఏడాది ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. - మానవ అక్రమ రవాణా, బలవంతపు శ్రమతో సహ ఆధునిక బానిసత్వాన్ని ఎదుర్కొవడానికి ఇటీవల ఏ దేశం తొలిసారిగా ‘యాంటీ స్లేవరీ కమిషనర్’ను నియమించింది?
జ: ఆస్ట్రేలియా. దీనికి కమిషనర్ గా క్రిస్ ఎనాన్స్ నియమితులయ్యారు. - దేశంలో స్టార్టప్ ల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతోంది?
జ: కేంద్ర ప్రభుత్వం ‘స్టార్టప్ మహాకుంభ్ 2025’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఢిల్లీలోని భారత్ మండపంలో ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనుంది. దీని ద్వారా వాణిజ్యవేత్తలు, పెట్టుబడి దారులు, ఆవిష్కర్తలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి భాగస్వామ్యాల ద్వారా కొత్త లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్నే స్టార్టప్ మహా కుంభ్ 5.0 అని కూడా పేర్కొంటున్నారు. 2024 నవంబర్ 24 నాటికి దేశంలో 1,54,719 స్టార్టప్ లు ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. - యూనికార్న్ సంస్థలు అనగా?
జ: కొద్దిపాటి పెట్టుబడులతో వినూత్న ఆవిష్కరణలతో ప్రారంభమైన సంస్థలు స్వల్పకాలంలో ఒక బిలియన్ డాలర్టకుపైగా(సుమారు రూ.8,629 కోట్లు) విలువ కలిగిన సంస్థలను యూనికార్న్ సంస్థలు అని పిలుస్తారు. - బ్యాంకు రేటు(bank rate) అనగా?
జ: రిజర్వ్ బ్యాంకు ఇతర బ్యాంకులకు రుణ సదుపాయం కోసం ఏర్పరిచే కనీస వడ్డీ రేటును బ్యాంకు రేటు అంటారు. - నగదు నిల్వల నిష్పత్తి(క్యాష్ రిజర్వ్ రేషియో-crr) అనగా?
జ:షెడ్యూల్డ్ బ్యాంకులు కొంత నిర్దిష్ట ద్రవ్యాన్ని తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద ఉంచాలి. దీన్నే సీఆర్ఆర్ అంటారు. సీఆర్ఆర్, బ్యాంకు రేట్లు మార్కెట్ లో చలామణిలో ఉన్న ద్రవ్య ప్రవాహ వేగానికి అడ్డుకట్ట వేయడానికి లేదా గతిశీలత పెంచడానికి ఉపయోగపడుతాయి. - స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో(slr) అనగా?
జ: వాణిజ్య బ్యాంకులు తమ రోజువారీ వ్యాపారంలో కాలానుగత రుణాలు, బంగారం, ధరావతులు లేదా సెక్యూరిటీస్.. అన్నీ ద్రవ్యత్వ సంపత్తిగా అంటే లిక్విడ్ అసెట్స్ గా కలిగి ఉంటాయి. బిజినెస్ డే ముగిసే సరికి ప్రతీ బ్యాంక్.. దాని రోజువారీ నికర డిమాండ్, రుణాలు ద్రవ్యత్వ సంపత్తికి కనీస అనుపాతంలో ఉండేలా చూసుకోవాలి. ఈ కనీస అనుపాత రాశినే చట్టపర ద్రవ్యత్వ రాశి నిష్పత్తిగా పిలుస్తారు. - రెపో రేటు(repo rate) అనగా?
జ: వాణిజ్య బ్యాంకులకు ధరావతుల(సెక్యూరిటీస్) ఆధారంగా రిజర్వ్ బ్యాంకు స్వల్పకాలిక అప్పుగా ఇచ్చే మొత్తంపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ఇది ఆర్బీఐ సూచనల ప్రకారం మారుతుంటుంది. - రివర్స్ రెపో రేటు(reverse repo rate) అనగా?
జ: వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునే అప్పుపై ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపోరేటు అంటారు. వ్యవస్థలో అధిక ద్రవ్యం ఉన్నప్పుడు ఆర్బీఐ రివర్స్ రెపో రేటును పెంచి బ్యాంకులు తమ అనుత్పాదక ద్రవ్యాన్ని ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసేలా చేస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం Telugu job motivators వెబ్ సైట్ ను సంపద్రించండి