కరెంట్ అఫైర్స్టుడే టాపిక్డైలీ న్యూస్బిట్ బ్యాంక్

ప్రపంచ ఆర్థిక సదస్సు ఏ నగరంలో జరుగుతోంది?

World economic forum: ప్రపంచ ఆర్థిక సదస్సు ఏ నగరంలో జరుగుతోంది?

కరెంట్ అఫైర్స్(Today current affairs) 20-01-2024

  1. సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన:
  • రాష్ట్రంలో రూ.450 కోట్లతో పెట్టుబడులకు ‘క్యాపిటలాండ్’ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్ లో అత్యాధునిక ఐటీ పార్క్ ను ఏర్పాటు చేయనుంది. 10లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఐటీ పార్క్ ను ఏర్పాటు చేయనుంది. గ్లోబల్ క్యాపిబిలిటీ సెంటర్లకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు ఇందులో ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి టీమ్ దావోస్(Davos) వెళ్లే క్రమంలో సింగపూర్ లో పర్యటించిన సంగతి తెలిసిందే.

2. వంతారా సంస్థను ఎవరు నిర్వహిస్తున్నారు?

    • ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఈ సంస్థను స్థాపించారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో వంతారా సంస్థ ఉంది. ఇందులో జంతువులకు సురక్షితమైన పునరావసాన్ని ఏర్పాటు చేస్తారు.

    3.సీపీఆర్(CPR) అనగా?

      -సీపీఆర్ అనగా ‘కార్డియో పల్మనరీ రిసిపిటేషనన్’(Cardio pulmonory recipitation). ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటు బారిన పడిన వారికి తక్షణ చర్యగా సీపీఆర్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా వ్యక్తిని గుండెపోటు ద్వారా రక్షించవచ్చు.

      1. తెలంగాణలో చిత్తారమ్మ జాతరను ఎక్కడ నిర్వహిస్తారు?
      • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజుల రామారంలో చిత్తారమ్మ జాతరను నిర్వహిస్తారు. ఈ ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనిది. ప్రతీ ఏడాది జనవరిలో ఈ జాతర నిర్వహిస్తారు.
      • 5.మొట్టమొదటి ఖోఖో వరల్డ్ చాంపియన్(KhoKho world champion) గా ఏ దేశం నిలిచింది?
        • న్యూఢిల్లీలో మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్ పోటీల్లో మహిళలు, పురుషుల విభాగంలో భారత్ చాంపియన్ గా నిలిచింది. తొలిసారి నిర్వహించిన ఈ ప్రపంచ కప్ లో రెండు విభాగాల్లో విజేతగా భారత్ నిలువడం గమనార్హం. మహిళల ఫైనల్లో నేపాల్ పై భారత్ విజయం సాధించగా, పురుషుల జట్టు సైతం నేపాల్ దేశ జట్టుపై విజయం సాధించింది. తొలి వరల్డ్ కప్ లో రెండు విభాగాల్లో ప్రపంచ విజేతగా నిలిచి భారత్ తన సత్తా చాటింది.

        6.ప్రపంచ ఆర్థిక సదస్సు(world economic forum) ఏ తేదీల్లో జరుగబోతోంది?

          • స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జనవరి 20న ప్రారంభమైంది. 24వరకు కొనసాగుతుంది. ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఈ చిన్న పట్టణం శాశ్వత వేదిక. ప్రతీ ఏడాది ఇక్కడే నిర్వహిస్తారు. ప్రపంచంలోని పలు దేశాల అధినేతలు, పారిశ్రామిక రంగ ప్రముఖులు వస్తారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా దావోస్ కు హాజరవుతున్నారు. ఇక్కడికి వచ్చే పెట్టుబడుదారులను తమ దేశ, రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టాల్సిందిగా కోరుతారు. పెట్టుబడి దారులకు తమ ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు, అవకాశాలు, మౌలిక వసతులు కల్పిస్తామో వివరిస్తారు. తద్వారా పెట్టుబడులు సాధిస్తారు.

          7.‘గేట్ వే’(gate way) పేరిట రోదసీ కేంద్రాన్ని ఏ దేశం ఏర్పాటు చేయబోతోంది?

            • ఐఎస్ఎస్ ప్రాజెక్టు సాధించిన విజయాలతో భవిష్యత్ లో చంద్రుడి కక్ష్యలో ‘గేట్ వే’ పేరిట భారీ రోదసీ కేంద్రాన్ని అమెరికా, ఇతర దేశాలు నిర్మించబోతున్నాయి. చంద్రుడి ఉపరితలంతో పాటు అంగారకుడు, ఇతర గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపడానికి ఇది మజిలీగా పనికొస్తుంది.

            8.ఏ రాష్ట్రంలోని గురు మాసిదాస్- తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ను 56వ టైగర్ రిజర్వ్ గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది?

              -ఛత్తీస్ గఢ్. ఇది దేశంలోనే మూడో అతిపెద్ద టైగర్ రిజర్వ్ గా గుర్తింపు పొందింది. మొదటి రెండు స్థానాల్లో నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్, మానస్ టైగర్ రిజర్వ్ (అసోం) నిలిచాయి.

              1. రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్:

              రాజ్యాంగం పనితీరును సమీక్షించడానికి ఎన్డీఏ ప్రభుత్వం 2000 ఫిబ్రవరి 22న జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య అధ్యక్షతన 10 మంది సభ్యులతో ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది.

              సభ్యులు:

              1. జస్టిస్ బి.పి. జీవన్ రెడ్డి(చైర్మన్, లా కమిషన్ ఆఫ్ ఇండియా)
              2. జస్టిస్ ఆర్.ఎస్. సర్కారియా( సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి)
              3. జస్టిస్ కె.పున్నయ్య (ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి)
              4. పీ.ఏ. సంగ్మా(లోక్ సభ మాజీ స్పీకర్)
              5. సోలీ జె. సోరాబ్జీ( అటార్నీ జనరల్)
              6. కె. పరాశరన్(మాజీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా)
                7.డాక్టర్ సుభాష్ సి. కశ్యప్(లోక్ సభ మాజీ సెక్రెటరీ)
                8.సి.ఆర్. ఇరానీ(ది స్టేట్స్ మన్ పత్రిక చీఫ్ ఎడిటర్)
              7. అబిద్ హుస్సేన్ ( యూఎస్ఏలో భారత మాజీ రాయబారి )
                10.శ్రీమతి సుమిత్ర జి. కులకర్ణి( మాజీ ఎంపీ )

              -ఈ కమిషన్ సభ్యుడు పి.ఎ. సంగ్మా కమిషన్ నివేదిక సమర్పించకముందే రాజీనామా చేశారు. ఈ కమిషన్ కు కార్యదర్శిగా డాక్టర్ రఘువీర్ సింగ్ వ్యవహరించారు. ఈ కమిషన్ రచనా సంఘం 2001 సెప్టెంబర్ లో డా. సుభాష్ సి. కశ్యప్ అధ్యక్షతన ఇద్దరు సభ్యులతో ఏర్పడింది. రచనా సంఘంలో కె.పరాశరన్, డా. అబిద్ హుస్సేన్ లను సభ్యులుగా నియమించారు.

              -రాజ్యాంగ సమీక్ష కమిషన్ 2002 మార్చి 31న తన అధ్యయన నివేదికను ప్రధాని వాజ్ పేయికి సమర్పించింది. 249 సిఫార్సులతో 11 శీర్షికలుగా నివేదికను రూపొందించింది.

              కొన్ని సూచనలు:

              -భారత రాజ్యాంగంలోని 4వ భాగం శీర్షిక- రాజ్యాంగ విధాన ‘ఆదేశిక సూత్రాలు’ నే చర్యగా సవరించాలి.

              -ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి.

              -రాజకీయ పార్టీలన్నీ మహిళలకు 30 శాతం స్థానాలు కేటాయించాలి.

              -పార్లమెంట్ ఏడాదికి 120 రోజులు సమావేశం కావాలి. రాజ్యసభ 100 రోజులు సమావేశం కావాలి. రాష్ట్ర శాసన సభలు కూడా ఏడాదికి 90 రోజులు సమావేశం కావాలి.

              -కార్యనిర్వహణ శాఖ, ప్రభుత్వ పాలన, అధికారుల్లో బాధ్యత, జవాబుదారీతనం పెంపొందించడానికి సామాజిక తనిఖీ వ్యవస్థను ప్రవేశపెట్టాలి.

              • న్యాయ శాఖలో మార్పులు చేపడుతూ, జాతీయ న్యాయ కమిషన్ ను ఏర్పాటు చేయాలి.
              • వ్యవస్థీకృతమైన మార్పులు జరగాలి. సాంఘిక, ఆర్థిక మార్పులతో పాటు అభివృద్ధి క్రమం విస్తరించాలి. మైనారిటీ వర్గాల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి చర్యలు చేపట్టాలి.
              • ఏడాదిలో కనీసం 80 రోజులు వేతనం అందేలా గ్రామాల్లో ఉపాధి పొందే హక్కును కల్పించడం.
              • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గురించి, ప్రాథమిక విధులకు సంబంధించి పౌరులకు తగిన అవగాహన, పరిజ్ఞానం కల్పించే చర్యలు చేపట్టాలి.

              మరిన్ని విద్యా, ఉద్యోగ, ఉపాధి వార్తలకు Telugu job motivators.comను చదవండి

              Leave a Reply

              Your email address will not be published. Required fields are marked *